- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్పంచ్ సాబ్ కు అదిరిపోయే న్యూస్...భారీ ప్లాన్ చేస్తున్న BCCI !
టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ కు ( Shreyas Iyer ) బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతి

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ కు ( Shreyas Iyer ) బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతి త్వరలో శ్రేయాస్ అయ్యర్ కు వన్డే కెప్టెన్సీ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ ( Rohit Sharma ) స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇస్తారని జోరుగా ప్రచారం అందుకుంది.
టెస్ట్ కెప్టెన్ గా గిల్ ( Shubman Gill) కొనసాగుతుండగా... రోహిత్ శర్మ రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత లేదా అంతకంటే ముందే వన్డే కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ కు ఛాన్సులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2027 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో రోహిత్ శర్మ ఉన్నాడు. ఈ నేపథ్యంలో కచ్చితంగా వన్డే కెప్టెన్సీ డేస్ లో... శ్రేయాస్ అయ్యర్ మాత్రమే ఉంటాడని తెలుస్తోంది.
ఆ లోపు కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India) దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కేకేఆర్ జట్టును ( KKR) ఛాంపియన్ గా చేయడమే కాకుండా పంజాబ్ కింగ్స్ ను ( Punjab Kings) ఫైనల్ దాకా తీసుకువెళ్లాడు సర్పంచ్ సాబ్ ( Sarpanch Saab) శ్రేయాస్ అయ్యర్. అందుకే అతనికి అవకాశం వస్తుందని చెబుతున్నారు. మరి దీనిపై త్వరలో ప్రకటన రానుంది.
🚨 BREAKING NEWS 🚨
— indianTeamCric (@Teamindiacrick) June 8, 2025
Shreyas Iyer might replace Rohit Sharma as captain of India's ODI team. pic.twitter.com/2SDKcBKisb






