ఎమర్జింగ్ ఆసియా కప్‌లో అయ్యర్, ఇషాన్, గైక్వాడ్?

by Harish |
ఎమర్జింగ్ ఆసియా కప్‌లో అయ్యర్, ఇషాన్, గైక్వాడ్?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఈ నెలలో జరగబోయే ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 18 నుంచి 27 వరకు ఒమన్ వేదికగా ఎమర్జింగ్ ఆసియా కప్ జరగనుంది. ఆ టోర్నీలో గ్రూపు-బిలో ఉన్న భారత ‘ఏ’ జట్టు.. ఒమన్, పాక్ ఏ, యూఏఈ జట్లతో ఆడనుంది. 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టి పెట్టుకుని సెలెక్టర్లు అయ్యర్, ఇషాన్ కిషన్, గైక్వాడ్‌లను ఆ టోర్నీలో ఆడించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ‘బీసీసీఐ ఆ దిశగా ఆలోచిస్తున్నది. ఈ సారి టోర్నీకి సీనియర్ సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేయనుంది. 2026లో జరిగే పొట్టి ప్రపంచకప్‌ను దృష్టి పెట్టుకుని టీ20 స్పెషలిస్ట్‌లను ఎంపిక చేయాలని వాళ్లు భావిస్తున్నారు.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా అయ్యర్, ఇషాన్ కిషన్, గైక్వాడ్‌ టీ20 జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. గైక్వాడ్ జూలైలో జింబాబ్వే చివరి టీ20 ఆడగా.. అయ్యర్, ఇషాన్ కిషన్ ఈ ఏడాదిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

Advertisement

Next Story