- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND VS AUS : శ్రేయస్ అయ్యర్‌కు గాయం.. సౌతాఫ్రికాతో సిరీస్‌కు డౌటే?
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు.

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్‌లో భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో హర్షిత్ రాణా వేసిన బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను అయ్యర్ అద్భుతంగా అందుకున్నాడు. గాల్లోకి లేపిన క్యాచ్‌ని అయ్యర్ వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి మరీ అందుకున్నాడు. బంతి అందుకునే సమయంలో డైవ్ చేసేటప్పుడు అయ్యర్ గాయపడ్డాడు. అతని ఎడమ పక్కటెముకలపై ఒత్తిడి పడింది. అతను తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయాడు. ఫిజియో వచ్చి చికిత్స చేసినా నొప్పి తగ్గలేదు. దీంతో అతను మైదానం వీడాడు. ఆ తర్వాత తిరిగి ఫీల్డ్‌లోకి రాలేదు. వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించారు.
‘సిడ్నీ గ్రౌండ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. అతని ఎడమ పక్కటెములకు గాయమైంది. గాయం తీవ్రతను అంచనా వేయడానికి అయ్యర్‌ను హాస్పిటల్‌కు తరలించారు.’అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
స్కానింగ్‌లో గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దాదాపు మూడు వారాలు అతను ఆటకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘ఆస్ట్రేలియా నుంచి వచ్చాక అతను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లోనే రిపోర్ట్ చేయాలి. అక్కడ అతను కోలుకుంటాడు.’అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో అతను సౌతాఫ్రికాతో సిరీస్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. ఆ లోగా అతను కోలుకుంటాడా?లేదా? అనేది తెలియదు. వెన్ను సమస్యతో అయ్యర్ ఇటీవల రెడ్ బాల్ క్రికెట్ నుంచి ఆరు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు.






