- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టు ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్. స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వచ్చేస్తున్నాడు. త్వరలోనే గ్రౌండ్ లో అడుగుపెట్టి ఎప్పటిలాగే బ్యాటింగ్ చేయనున్నాడు శ్రేయాస్ అయ్యర్. ప్రస్తుతం విజయ్ హజారే టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటు చివరి దశలో శ్రేయాస్ అయ్యర్ రంగంలోకి దిగబోతున్నాడు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఒకవేళ విజయ్ హజారే టోర్నమెంట్ చివరి దశలో శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ ఇస్తే, జనవరిలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్ కు కూడా అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. ఇదే జరిగితే, భారత జట్టుకు చాలా ప్లస్ అవుతుంది. ఇది ఇలా ఉండగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరిగిన నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. దీంతో అప్పటి నుంచి అతడు జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ రీ ఎంట్రీ చేస్తాడని అంటున్నారు.






