- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ABD: షాట్ ఆఫ్ ది ఐపీఎల్ 2025 ఇదే.. మైండ్ బ్లాక్ కావాల్సిందే
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో ఫైనల్ జట్లు ఏవి అనేది తేలిపోయింది. జూన్ మూడవ తేదీన ఫైనల్స్ లో.. రాయల్

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో ఫైనల్ జట్లు ఏవి అనేది తేలిపోయింది. జూన్ మూడవ తేదీన ఫైనల్స్ లో.. రాయల్ చాలెంజెస్ బెంగళూరు (Royal Challengers Bangalore) వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో... ఐపీఎల్ 2025 ఫైనల్ జరుగుతుంది. అయితే... క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో ముంబై జట్టును చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్... నేరుగా ఫైనల్ కి వెళ్ళింది.
అయితే ఈ క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును దగ్గరుండి గెలిపించాడు. 80 కి పైగా పరుగులు చేసి రఫ్ ఆడించాడు. ఈ నేపథ్యంలోనే... శ్రేయస్ అయ్యర్ కొట్టిన ఓ బౌండరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబై స్టార్ బౌలర్ బుమ్రా ( Bumrah)... వేసిన యార్కర్ ను ఎదుర్కోవడం ఎవరివల్ల కాదు.
కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం అవలీలగా బౌండరీ కొట్టేశాడు. యార్కర్ బంతిని... చిన్నగా బ్యాట్ కు తగిలించి వెనక్కి ఫోర్ పంపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. గత పది సంవత్సరాల కిందట.. ఢిల్లీ తరఫున కూడా ఇదే షాట్ ఆడాడు. అయితే అయ్యర్ ఆడిన ఈ షాట్ ఫై... ఎబి డివిలియర్స్ ( AB de Villiers ) స్పందించారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో.. ఇదే అత్యుత్తమ షాట్ అంటూ.. కితాబ్ ఇచ్చారు 360 డిగ్రీ ప్లేయర్.






