KKR యంగ్ బ్యాటర్ రఘువంశీకి షాక్.. భారీ జరిమానా విధించిన బీసీసీఐ

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-27 08:37:02  IST  )

KKR యంగ్ బ్యాటర్ రఘువంశీకి షాక్.. భారీ జరిమానా విధించిన బీసీసీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే వరుస పరాజయాలతో కుదేలైన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యు బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ (Angkrish Raghuvanshi) సహనం కోల్పోయాడు. లక్నో సూపర్ జెయింట్స్‌ (Lucknow Super Giants)తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో తన అవుట్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రఘువంశీ క్రికెట్ పరికరాలను దుర్వినియోగం చేసినందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతడిపై భారీ జరిమానా విధించింది.

వివరాల్లోకి వెళితే.. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఓ వివాదాస్పద నిర్ణయం కారణంగా రఘువంశీ అవుటయ్యాడు. అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో ఆగ్రహంతో తన బ్యాట్‌తో మైదానంలోని పరికరాలను బలంగా కొట్టాడు. ఇది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి (Code of Conduct) ప్రకారం ‘లెవల్-1’ నేరంగా పరిగణించబడింది. అయితే, రఘువంశీ తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 2.2 ప్రకారం క్రికెట్ పరికరాలు, దుస్తులు, గ్రౌండ్ ఫిక్చర్‌లను దుర్వినియోగం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.

Next Story