గుజరాత్ జెయింట్స్‌కు షాక్.. WPL నుంచి డియాండ్రా డాటిన్ ఔట్

by Disha Web Desk 12 |
గుజరాత్ జెయింట్స్‌కు షాక్.. WPL నుంచి డియాండ్రా డాటిన్ ఔట్
X

ముంబై : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)‌ ఆరంభంలోనే గుజరాత్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు క్రీడాకారిణి, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ లీగ్ నుంచి వైదొలిగింది. వేలంలో డాటిన్‌ను గుజరాత్ జెయింట్స్‌ను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. ఆరోగ్య పరిస్థితి కారణంగా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో డాటిన్ లీగ్‌కు దూరమైనట్టు తెలుస్తోంది.

అయితే, దీనిపై ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌ను గుజరాత్ జెయింట్స్ జట్టులోకి తీసుకుంది. ఆమె జట్టులోకి వచ్చినట్టు ట్విట్టర్ వేదికగా ఫ్రాంచైజీ వెల్లడించింది. వేలంలో కిమ్ గార్త్ అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కిమ్ గార్త్ సభ్యురాలిగా ఉన్నది. టీ20ల్లో 54 మ్యాచ్‌లు ఆడిన ఆమె 23.09 సగటుతో 762 పరుగులు చేసింది. అలాగే, 43 వికెట్లు తీసింది.

Also Read...

గబ్బా కంటే ఇండోర్ పిచ్ చాలా బెటర్: సన్నీ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed