షోయబ్ అక్తర్‌కు భారీ షాక్.. ఇండియాలో అతని యూట్యూబ్ చానెల్‌పై నిషేధం

by Harish |

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌‌పై భారత్ తీవ్ర చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

షోయబ్ అక్తర్‌కు భారీ షాక్.. ఇండియాలో అతని యూట్యూబ్ చానెల్‌పై నిషేధం
X

దిశ, స్పోర్ట్స్ : పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌‌పై భారత్ తీవ్ర చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లపై భారత్ నిషేధం విధించింది. అందులో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చానెల్ కూడా ఉంది. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అక్తర్ కామెంటేటర్‌గా మారాడు. అలాగే, తన యూట్యూబ్ చానెల్ ద్వారా వరల్డ్ క్రికెట్‌పై తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు. అక్తర చానెల్‌తోపాటు డాన్ న్యూస్, సమా టీవీ, ఆరీ న్యూస్, జియో న్యూస్ వంటి ప్రముఖ చానెల్స్‌ను ఇండియాలో బ్లాక్ చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను రేకెత్తించే కంటెంట్‌ వ్యాప్తిని నియంత్రించడానికి భారత్ ఈ చానెల్స్‌పై నిషేధం విధించింది. ప్రజలను తప్పుదారి పట్టించే కథనాలు, మతపరమైన విభజనలను ప్రేరేపించే ప్రయత్నాలు చేస్తున్న చానెల్స్‌ను బ్లాక్ చేయాలని భారత హోం మంత్రిత్వ శాఖ సిఫార్సులు చేసింది. ఇండియాలో బ్లాక్ చేసిన 16 యూట్యూబ్ చానెల్స్‌కు మొత్తం 63 మిలియన్ల సబ్‌స్కైబర్లు ఉన్నారు.


Next Story