- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్ కు షోయర్ అక్తర్ వార్నింగ్..టీమిండియా చేతిలో ఓడిపోవడం పక్కా
పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం గ్యారంటీ అంటూ

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... మరికాసేపట్లోనే టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో... పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం గ్యారంటీ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సూర్య కుమార్ నేతృత్వంలోని టీమిండియా చాలా బలంగా ఉందని వ్యాఖ్యానించారు.
టి20 టోర్నమెంట్ లలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోందని... వెల్లడించారు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ టీం.. చాలా జాగ్రత్తగా ఉండాలని తమ సొంత జట్టుకు సూచనలు ఇచ్చారు అక్తర్. ఆసియా కప్ టోర్నమెంటులో కూడా టీమిండియా కచ్చితంగా ఆధిపత్యం చెలాయిస్తుందని... కాబట్టి ఆచితూచి ఆడాలని వెల్లడించారు. ఆసియా కప్ టోర్నమెంట్ ఫైనల్స్ లో పాకిస్తాన్ తో కాదు ఆఫ్ఘనిస్తాన్ తో ఆడటానికి టీమిండియా ఇష్టపడుతుందని వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ లాంటి... ఆటగాడు లేనందన పాకిస్థాన్ వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.






