టీమిండియాపై అక్త‌ర్ సీరియస్‌...మ‌మ్మ‌ల్ని అవ‌మానించారు !

by velandi.Saikiran |

పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ స్పందించారు. క్రీడాల్లో షేక్ హ్యాండ్ అనేది చాలా కీలకమన్నారు. కచ్చితంగా

టీమిండియాపై అక్త‌ర్ సీరియస్‌...మ‌మ్మ‌ల్ని అవ‌మానించారు !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు టీమ్ ఇండియా ప్లేయర్లు. దీంతో వివాదం.. తార స్థాయికి చేరింది. అయితే ఈ వివాదంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ స్పందించారు. క్రీడాల్లో షేక్ హ్యాండ్ అనేది చాలా కీలకమన్నారు. కచ్చితంగా ఇరుజట్ల ప్లేయర్లు కరచాలనం చేసుకోవాల్సిందేనని వివరించారు.

కానీ టీమిండియా మాత్రం అత్యంత దారుణంగా... వ్యవహరించిందని మండిపడ్డారు. క్రికెట్ కు అలాగే రాజకీయాలకు ముడి పెట్టకూడదని.... ఈ సందర్భంగా కోరారు షోయబ్ అక్తర్. వాస్తవానికి మ్యాచ్ ఫినిష్ అయిన.... వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటే బాగుండేది అన్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా విజయం సాధించిందని చెప్పుకొచ్చారు.

Next Story