- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నఖ్వీ దూలతీర్చిన దూబే...నువ్వు ఇచ్చేది ఏంట్రా అంటూ !
ఆల్ రౌండర్ శివం దూబే. మొహ్సిన్ నఖ్వీ ( mohsin Naqvi) టైటిల్ ఇవ్వకపోయినా... తన దగ్గర మరో టైటిల్ ఉన్నద

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన నేపథ్యంలో... తన కుటుంబంతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఆల్ రౌండర్ శివం దూబే. మొహ్సిన్ నఖ్వీ ( mohsin Naqvi) టైటిల్ ఇవ్వకపోయినా... తన దగ్గర మరో టైటిల్ ఉన్నదని.. కుటుంబంతో అదిరిపోయే సెలబ్రేషన్స్ చేసుకొని కౌంటర్ ఇచ్చాడు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఛాంపియన్ గా టీం ఇండియా నిలిచింది.
అయితే లెక్క ప్రకారం... ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ( mohsin Naqvi) చేతుల మీదుగా విజేత ట్రోఫీ అందుకోవాలి. అయితే భారతదేశం అలాగే పాకిస్తాన్ మధ్య ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా టైటిల్ అందుకోలేదు. బీసీసీఐ ముందుగా చెప్పినట్లుగానే టైటిల్ తీసుకోకుండానే దుబాయ్ నుంచి ఇండియా వచ్చేసింది టీం ఇండియా. ఇప్పటికీ కూడా మొహ్సిన్ నఖ్వీ టైటిల్ ను పంపించలేదు.
ఇలాంటి నేపథ్యంలో... కొన్ని డమ్మీ ఆసియా కప్ ట్రోఫీలతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు టీమిండియా ప్లేయర్లు. ఇందులో భాగంగానే టీమిండియా ఆల్ రౌండర్ శివం దూబే కూడా ఓ చిన్నపాటి టైటిల్ కొనుక్కు వచ్చి... తన కుటుంబంతో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. వాడిచ్చేదేంటి మాకు మేమే టైటిల్ కొనుక్కుంటాం అంటూ కౌంటర్ ఇస్తున్నారు. మొహ్సిన్ నఖ్వీ దూబే అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడని మరికొంతమంది సపోర్ట్ గా నిలుస్తున్నారు. క్లిక్
Read More: బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన మొహ్సిన్ నఖ్వీ






