- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన ఆత్మకథను ప్రకటించిన శిఖర్ ధావన్.. ‘ది వన్’ పేరుతో రిలీజ్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన ఆటోబయోగ్రఫీని ‘ది వన్’ పుస్తకం పేరుతో రిలీజ్ చేయబోతున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన ఆటోబయోగ్రఫీని ‘ది వన్’ పుస్తకం పేరుతో రిలీజ్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మంగళవారం వెల్లడించాడు. ‘ప్రతి గెలుపు అందరికీ తెలియదు. ప్రతి ఓటమిపై స్కోరు బోర్డుపై కనిపించదు. ‘ది వన్’ అనేది ఈ రెండింటి మధ్య ఉన్న కథ. నేర్చుకోవడం, మరిచిపోవడం, ధైర్యంగా ముందుకు సాగడం గురించిన కథ ఇది. ఇది నా హృదయం నుంచి వచ్చింది.’అని రాసుకొచ్చాడు. ‘మీరు నా కవర్ డ్రైవ్‌లు, వేడుకులు, నవ్వులు చూశారు. కానీ, లోపల ఉన్న కథలను చెప్పే సమయం వచ్చింది’అని ధావన్ తెలిపాడు. ఢిల్లీ నుంచి భారత స్టార్ క్రికెటర్‌గా తన ప్రయాణాన్ని తన ఆత్మకథలో ఆవిష్కరించనున్నాడు. అలాగే, కెరీర్‌లో తాను ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, గాయాలు, మానసిక పోరాడిన విషయాలను ధావన్ పంచుకోనున్నాడు. గతేడాది ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియా తరపున 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అతను 10 వేలకుపైగా రన్స్ చేశాడు.
- Tags
- Shikhar Dhawan






