- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధానితో నఖ్వీ అత్యవసర భేటీ..టీ20 వరల్డ్ కప్ పై షాకింగ్ నిర్ణయం ?
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఆడినప్పటికీ ఇండియాతో జరిగే మ్యాచ్ కు దూరంగా ఉండాలని పాకిస్తాన్ ఆలోచన చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో అత్యవసర సమావేశం అయ్యారు PCB చైర్మన్ నఖ్వీ. ఈ సందర్భంగా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో పాకిస్తాన్ పాల్గొనడంపై చర్చ జరిగినట్లు వెల్లడించారు నఖ్వీ. ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో సమావేశం అనంతరం నఖ్వీ మాట్లాడారు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ బాయ్ కాట్ ఆలోచన ఇంకా తమ పరిశీలనలోనే ఉందని వెల్లడించారు నఖ్వీ.
ఇండియాతో మ్యాచ్ కు దూరంగా పాక్
దీనిపై తుది నిర్ణయం వచ్చే శుక్రవారం లేదా సోమవారం రోజున తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే పాకిస్తాన్ టీం ను ప్రకటించినప్పటికీ కూడా బాయ్ కాట్ అంశాన్ని మాత్రం పరిశీలిస్తున్నట్లు బాంబు పేల్చారు నఖ్వీ. ఇది ఇలా ఉండగా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఆడినప్పటికీ ఇండియాతో జరిగే మ్యాచ్ కు దూరంగా ఉండాలని పాకిస్తాన్ ఆలోచన చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.






