వరల్డ్ చాంపియన్‌గా శీతల్.. పారా వరల్డ్ ఆర్చరీలో స్వర్ణం కైవసం

by Harish |

భారత పారా ఆర్చర్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విభాగంలో వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది.

వరల్డ్ చాంపియన్‌గా శీతల్.. పారా వరల్డ్ ఆర్చరీలో స్వర్ణం కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : భారత పారా ఆర్చర్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విభాగంలో వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. సౌత్ కొరియాలో జరుగుతున్న పారా వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆమె సంచలన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే రెండు పతకాలు సాధించిన ఆమె తాజాగా మహిళల కాంపౌండ్ విభాగంలో స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో శీతల్ ఏకంగా వరల్డ్ నం.1 క్రీడాకారిణికే షాకిచ్చింది. తుర్కియేకు చెందిన ఒజ్నుర్ క్యూర్ గిర్డిని‌ప 143-146 తేడాతో విజయం సాధించింది. ఇద్దరి మధ్య ఫైనల్ ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్ 29-29తో టై అవ్వగా.. రెండో సెట్‌లో శీతల్ 30-27తో పైచేయి సాధించి మూడు పాయింట్ల లీడ్ సాధించింది. అయితే, మూడో సెట్ 29-29తో టై అవడం, నాలుగో సెట్‌‌లో ప్రత్యర్థి గెలవడంతో శీతల్ ఆధిక్యం రెండుకు పడిపోయింది. అయితే, చివరి సెట్‌లో శీతల్ మూడు కచ్చితమైన బాణాలు సంధించి 30 పాయింట్స్ గెలవడంతో వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. దీంతో ఈ టోర్నీలో ఆమె మూడో పతకం సాధించింది. కాంపౌండ్ మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్‌‌లో సరితతో కలిసి రజతం, కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో టోమన్ కుమార్‌తో కాంస్యం గెలిచింది.


Next Story