WTC ఫైనల్‌కు అక్సర్ పటేల్ స్థానంలో శార్ధుల్ ఠాకూర్: DK

by Disha Web Desk 12 |
WTC ఫైనల్‌కు అక్సర్ పటేల్ స్థానంలో శార్ధుల్ ఠాకూర్: DK
X

దిశ, వెబ్‌డెస్క్: భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.జూన్ 7న లండన్ వేదికగా జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ భారత ప్లేయింగ్ లేవన్‌లో అక్షర్ పటేల్ కు చోటు దక్కదని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. అలాగే అక్షర్ పటేల్ స్థానంలో భారత యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ చోటు దక్కే అవకాశం ఉన్నట్లు కార్తీక్ చెప్పారు. ఇది ఒక్కసారిగా జరిగే గేమ్ అని కార్తీక్ అన్నాడు. అలాగే ప్లేయింగ్ లేవన్ చోటు కోసం భారత్ కూడా జడేజా, అశ్విన్‌ల మధ్య ఎంపిక చేయవలసి ఉంటుందని దినేష్ కార్తీక్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

Next Story

Most Viewed