క‌రోనా వ్యాక్సినే కొంప ముంచింది..షేన్ వార్న్ కుమారుడి సంచలన వ్యాఖ్య‌లు!

by velandi.Saikiran |   (  Updated:2026-04-14 17:02:15  IST  )

క‌రోనా వ్యాక్సిన్ త‌న తండ్రి షేన్ వార్న్ మృతి చెందాడ‌ని ఆయ‌న కుమారుడు ఆరోప‌ణ‌లు చేశారు.

క‌రోనా వ్యాక్సినే కొంప ముంచింది..షేన్ వార్న్ కుమారుడి సంచలన వ్యాఖ్య‌లు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ మృతి పై ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్ వ‌ల్ల‌ తన తండ్రి మరణించాడని ఇప్పుడు అనిపిస్తోందంటూ షాకింగ్ నిజాలను బయటపెట్టాడు జాక్సన్. ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న‌ జాక్సన్, ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి షేన్‌ కరోనా సమయంలో నాలుగు టీకాలు తీసుకున్నాడని వెల్లడించారు. ఆ కరోనా టీకాలు తీసుకోవడం తన తండ్రికి ఏ మాత్రం ఇష్టం లేదని వెల్లడించాడు జాక్స‌న్‌.

కానీ ఎమర్జెన్సీ పరిస్థితుల‌ నేపథ్యంలో టీకాలు ఇప్పించుకున్నాడని పేర్కొన్నారు. ఆ తర్వాత క‌రోనా వ్యాక్సిన్, ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపించిందని ఎమోషనల్ అయ్యాడు. మద్యం, స్మోకింగ్ అలవాటు కూడా తన తండ్రికి ఉందని చెప్పుకొచ్చాడు. ఓవరాల్ గా కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత తన తండ్రి ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు తెలిపాడు. దీంతో జాక్సన్ వార్న్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాగా థాయిలాండ్ లో 2022 సంవత్సరంలో స్పిన్నర్ షేన్ వార్న్ గుండెపోటుతో మరణించారు. ఈ మేర‌కు అధికారులు కూడా ఈ విషయాన్ని గుర్తించారు.

Next Story