షమికి క్యారెక్టర్‌ లేదు.. మాజీ భార్య సంచలన ఆరోపణలు

by Yella Dhawani Reddy |

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

షమికి క్యారెక్టర్‌ లేదు..  మాజీ భార్య సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి (Team India fast bowler Mohammed Shami) వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయనకు, మాజీ భార్య హసీన్ జహాన్‌కు సంబంధించి విడాకుల కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, షమి ప్రతి నెలా రూ.4 లక్షల పరిహారం తన మాజీ భార్యకు చెల్లించాల్సి ఉంది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హసీన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా షమిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. షమి తన కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా ఇతరులపై డబ్బులు ఖర్చు చేస్తున్నాడని ఆమె విమర్శించారు.

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చేసిన ఈ వ్యాఖ్యల్లో హసీన్ జహాన్, 'షమికి అసలు క్యారెక్టర్‌ లేదు. గర్వంతో నన్ను, నా బిడ్డను మానసికంగా వేధించాడు. నన్ను భయపెట్టేందుకు కొన్ని క్రిమినల్‌లకు డబ్బులు చెల్లించాడు. ఇప్పుడైనా నిజం వెలుగులోకి వచ్చింది. కోర్టు తీర్పుతో న్యాయం నాతో ఉంది' అని తెలిపారు. ఆమె షమిపై ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే.

హసీన్ జహాన్ గతంలో షమిపై అనైతిక సంబంధాలు, గృహ హింస, మానసిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2018లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత షమి పట్ల సమాజంలో మిశ్రమ స్పందన ఏర్పడింది. అప్పటి నుంచి వారి మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. తాజాగా కోర్టు తీర్పుతో ఆమెకు కొంత న్యాయం జరిగిందన్న భావన హసీన్‌కి కలిగినట్లు తెలుస్తోంది. కానీ ఆమె ఆరోపణల వల్ల షమి పట్ల మరోసారి నెగటివ్ ప్రచారం మొదలైందని స్పష్టంగా కనిపిస్తోంది. షమి ఇప్పటివరకు ఈ వ్యాఖ్యలపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు.

Next Story