Mohammed Shami: టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన షమీ

by Ajay Maddhiboyina |

టీమ్ ఇండియా క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తరవాత షమీ కూడా గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

Mohammed Shami: టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన షమీ
X

దిశ‌, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తరవాత షమీ కూడా గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.వరుస కథనాలు రావడంతో షమీ ఆ వార్తలపై స్పందించాడు. తన రిటైర్మెంట్ వార్త రాసిన ఇంగ్లీష్ వెబ్ సైట్ లింక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి రాసిన కంటెంట్ రైటర్‌కు కౌంటర్ ఇచ్చాడు. ముందు నీ ఉద్యోగానికి వీడ్కోలు పలకడానికి రోజులు లెెక్కపెట్టుకో, తరవాత నా రిటైర్మెంట్ గురించి ఆలోచించవచ్చు అంటూ ఘాటుగా స్పందించాడు.

నీ లాంటి వాళ్లు మీడియాను సర్వనాశనం చేశారు అంటూ మండిపడ్డారు. ఆటగాళ్ల భవిష్యత్ గురించి ఒకరోజు అయినా మంచిగా చెప్పండి, ఈ రోజుకు ఇది నాకు చెత్త వార్త..స్వారీ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఇదిలా ఉంటే 34ఏళ్ల షమీ ఫిట్నెస్ మెయింటెయిన్ చేయలేకపోతున్నాడు అంటూ గత కొద్దిరోజులుగా ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. ఇంగ్లాండ్‌లో జరగబోయే టెస్ట్ సిరీస్‌లోనూ షమీని ఎంపిక చేయకపోవచ్చు అనే పుకార్లు వచ్చాయి. దీంతో ఆయన రిటైర్మెెంట్ పై సైతం వార్తలు మొదలవ్వడంతో చివరికి స్పందించి సమాధానం ఇచ్చాడు.

Next Story