- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఆ డేంజర్ ప్లేయర్ వస్తున్నాడు
కివీస్ తో జరిగే వన్డే సిరీస్ కోసం మహమ్మద్ షమీని, భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. చాలా రోజుల నుంచి అందరూ ఎదురుచూస్తున్న మహమ్మద్ షమీ, భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. న్యూజిలాండ్ వర్సెస్ భారత జట్టు మధ్య జనవరి 11వ తేదీ నుంచి వన్డే సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో జట్టును రెండు రోజుల్లో ప్రకటిస్తారని చెబుతున్నారు.
అయితే ఈ సిరీస్ నేపథ్యంలో మహమ్మద్ షమీకి అవకాశం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మహమ్మద్ షమీకి కూడా బీసీసీఐ నుంచి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని మహమ్మద్ షమీని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చిందట. అందుకే ఇప్పటి నుంచే షమీని వాడుకోవాలని రంగం సిద్ధం చేస్తున్నారట. కాగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి.






