- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND VS PAK : భారత్, పాక్ మ్యాచ్‌పై పహల్గాం ఉగ్రదాడి బాధితులు ఏమన్నారో తెలుసా?
ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ బాయ్‌కాట్ డిమాండ్ల మధ్యే జరిగింది.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ బాయ్‌కాట్ డిమాండ్ల మధ్యే జరిగింది. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని లక్షల్లో పోస్టులు పెట్టారు. రాజకీయ నాయకులు, మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్‌ను వ్యతిరేకించారు. ఇటీవల పాక్‌తో మ్యాచ్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన సంతోష్ జగ్దాలే కూతురు అసవారి జగ్దాలే.. ప్రభుత్వ నిర్ణయాన్ని సిగ్గుచేటు అని వ్యాఖ్యానించింది. ‘పహల్గాం ఘటన జరిగి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇంత జరిగినా మ్యాచ్‌ను నిర్వహించడానికి వారికి సిగ్గు లేదు.’అని ఘాటుగా స్పందించింది. తన తండ్రిని, సోదరుడిని కోల్పోయిన భావ్‌నగర్‌కు చెందిన సావన్ పర్మార్.. పాక్‌తో భారత్ ఆడుతుందనే వార్త తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందన్నాడు. ‘మీకు మ్యాచే కావాలనుకుంటే బులెట్లల బారిన పడిన నా 16 ఏళ్ల సోదరుడిని తీసుకరండి. ఆపరేషన్ సిందూర్ కూడా వ్యర్థం అనిపిస్తుంది.’అని ఓ జాతీయ మీడియాకు చెప్పాడు.
అసలు భారత్, పాక్ మ్యాచేనా?
భారత్, పాక్ మ్యాచ్ చూస్తుంటే అసలు ఇది భారత్, పాక్ మ్యాచేనా అనిపించక మానదు. సాధారణంగా భారత్, పాక్ మ్యాచ్ అంటే స్టేడియం మొత్తం నిండిపోతుంది. కానీ, ఈ మ్యాచ్‌పై అభిమానులు మ్యాచ్‌పై ఆసక్తి చూపించలేదు. చాలా మంది గేమును బాయ్‌కాట్ చేశారు. స్టేడియంలో ఖర్చీలు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. దుబాయ్ స్టేడియం కెపాసిటీ 25 వేలు. అందులో సగం సీట్లలో కూడా ప్రేక్షకులు లేరు. టికెట్లే పూర్తిగా సేల్ కాలేదని వార్తలు వచ్చాయి. అధిక ధరలతోపాటు బాయ్‌కాట్ డిమాండ్ మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపింది.






