- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10 వేల రన్స్ చేయకపోతే 'నువ్వు' సిగ్గుపడాలి! హర్భజన్ సింగ్
వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కెరీర్ మొదట్లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. తనతో జరిపిన సంబాషణను తాజాగా గుర్తు చేసుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్, కెరీర్ మొదట్లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. తనతో జరిపిన సంబాషణను తాజాగా గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో అడుగుపెట్టిన తర్వాత షార్ట్ బాల్స్ కు ఔటైన వెంటనే తీవ్ర నిరాశకు గురయ్యేవాడని, తాను టెస్ట్ క్రికెట్ లో సరిగ్గా బ్యాటింగ్ చేయలేనేమో అని అనుమానాలు వ్యక్తం చేసేవాడని అన్నాడు.
విరాట్ కోహ్లీ కెరీర్ ఆరంభంలో జరిగిన ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుందని.. అప్పుడు శ్రీలంక తో వన్డే సిరేస్ జరుగుతోంది. అదే సమయానికి అజంతా మెండిస్ వికెట్లు తీస్తున్నాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. నిలదొక్కుకొని హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ నా వద్దకు వచ్చి, ఎలా ఆడాను పాజీ(అన్న)? అని నన్ను అడగ్గా.. బాగా ఆడావని అయితే ఔట్ కాకుండా మరిన్ని ఎక్కువ రన్స్ చేయాల్సి ఉండేదని చెప్పానని అన్నాడు.
అయితే.. విరాట్ టెస్ట్ అరంగేట్రం జరిగింది వెస్ట్ ఇండీస్ పైనే! అప్పుడు కోహ్లీని రెండు ఇన్నింగ్స్ ల్లోనూ విండీస్ పేసర్ ఫిడేల్ ఎడ్వర్డ్స్ షార్ట్ బాల్స్ లో ఔట్ చేశాడు. దీంతో కోహ్లీ తీవ్ర నిరాశకు గురయ్యాడు. తర్వాత కోహ్లీ నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. తాను సరిగ్గా బ్యాటింగ్ చేయలేనా అనే అనుమానాలు నాతో వ్యక్తం చేయగా.. నేను కోహ్లీకి ఒకటే చెప్పా, నువ్వు బాగా ఆడుతున్నావని, అయితే క్రీజులో నిలదొక్కుకొని ఉంటే నువ్వు ఎక్కువ రన్స్ చేయగలవని, నీ కెరీర్ లో టెస్ట్ క్రికెట్ లో 10 వేల రన్స్ చేయగలిగే సత్తా నీకు ఉందనీ, ఒకవేళ నువ్వు 10 వేల రన్స్ చేయకపోతే మాత్రం అప్పుడు నువ్వు సిగ్గుపడాలని.. కోహ్లీతో అన్నట్లు హర్బజన్ చెప్పుకొచ్చాడు. కాగా విరాట్ ఇప్పటివరకు 113 టెస్టుల్లో మొత్తం 8848 పరుగులు చేశాడు. దీంట్లో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.






