దీనస్థితిలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్... చెత్త ఏరుకుంటూ!

by velandi.Saikiran |

షాహిద్ అఫ్రిది... చెత్త ఏరుకుంటూ కనిపించాడు. ప్లేయర్లందరూ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో... అక్కడ ఉన్న చెత్తను ఏరుకుంటూ డ

దీనస్థితిలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్... చెత్త ఏరుకుంటూ!
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది గురించి తెలియని వారం ఉండరు. బూమ్ బూమ్ ఆఫ్రిది పేరుతో.. అతన్ని ముద్దుగా పిలుచుకుంటారు. అతడు బ్యాటింగ్ కు దిగాడు అంటే సిక్స్ లు, బౌండరీలే. ఒక్క సింగిల్ కూడా తీసేవాడు కాదు. లేకపోతే డకౌట్ కావడం గ్యారెంటీ. ఒకానొక సమయంలో పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు షాహిద్ ఆఫ్రిది.

అయితే ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న షాహిద్ అఫ్రిది... అప్పుడప్పుడు క్రికెట్ చూసేందుకు స్టేడియాలకు కూడా వస్తున్నాడు. అయితే అలాంటి షాహిద్ అఫ్రిది... చెత్త ఏరుకుంటూ కనిపించాడు. ప్లేయర్లందరూ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో... అక్కడ ఉన్న చెత్తను ఏరుకుంటూ డస్ట్ బిన్ లో పడేశాడు.

ఈ సంఘటన ఇంగ్లాండ్ లో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోని చూసిన ఇండియన్స్... అఫ్రిది పరువు తీస్తున్నారు. వీడికి చెత్త ఏరుకునే పరిస్థితి వచ్చింది.. ఇండియా తో పెట్టుకుంటే అందరి పరిస్థితి అలాగే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇటీవల యుద్ధం జరిగిన తర్వాత.. ఉగ్రవాదులకు సపోర్టుగా ర్యాలీ కూడా తీశాడు షాహిద్ అఫ్రిది.

InstagrammeLink

Next Story