చూసుకుందాం రండి.. టీమిండియా ప్లేయర్ కు అఫ్రిది సవాల్

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద

చూసుకుందాం రండి.. టీమిండియా ప్లేయర్ కు అఫ్రిది సవాల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ( shahid afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ... రెచ్చగొడుతున్నారు. ఇటీవల ఇండియన్ ఆర్మీ ని ( Indian Army) అవమానించిన షాహిద్ అఫ్రిది... ఇప్పుడు టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ను ( Shikhar Dhawan) రెచ్చగొడుతున్నాడు. గెలుస్తారో లేదా ఓడిపోతారో ఏదో ఒకటి తేల్చుకుందాం... దమ్ముంటే రండి అంటూ శిఖర్ ధావన్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు ఆఫ్రిది.

అంతేకాదు ఓ టీ తాగుతూ... పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ ధరించి... ఈ సవాల్ విసిరాడు షాహిద్ ఆఫ్రిది. దీంతో అతడు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అంతకుముందు... ఇండియన్ ఆర్మీ ని అవమానించిన షాహిద్ ఆఫ్రిదిపై శిఖర్ ధావన్ ఫైర్ అయ్యాడు. కార్గిల్ లో ఓడిపోయారు.. ఇప్పుడు మళ్లీ ఓడిపోతారా...? ఎందుకు మాతో పెట్టుకుంటున్నారని చురకలు అంటించారు. మాతో పెట్టుకోకండి అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అనవసరంగా ఇండియన్ ఆర్మీ ని.. అవమానపరిచేలా మాట్లాడకూడదని ఫైర్ అయ్యారు శిఖర్ ధావన్. భారత సైన్యం పట్ల మాకు చాలా గర్వంగా ఉందన్నారు. అయితే శిఖర్ ధావన్ చేసిన ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గా తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది రెచ్చిపోయాడు.

Next Story