ఐసీసీ అవార్డుకు భారత మహిళా క్రికెటర్ నామినేట్

by Harish |

భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ నవంబర్‌కు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు రేసులో నిలిచింది.

ఐసీసీ అవార్డుకు భారత మహిళా క్రికెటర్ నామినేట్
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ నవంబర్‌కు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు రేసులో నిలిచింది. అవార్డుకు షెఫాలీ నామినేట్ అయినట్టు ఐసీసీ శుక్రవారం వెల్లడించింది. నవంబర్‌లో భారత జట్టు తొలిసారిగా ఐసీసీ వరల్డ్ కప్ గెలవడంలో షెఫాలీ కీలక పాత్ర పోషించింది. ప్రాతిక రావల్ గాయపడటంతో ఆమె స్థానంలో వచ్చిన ఆమె ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో ఆకట్టుకోలేకపోయింది. కానీ, సౌతాఫ్రికాతో ఫైనల్‌లో ఆమె అదరగొట్టింది. 78 బంతుల్లో 87 పరుగులు చేసి భారత్ టైటిల్ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. షెఫాలీతోపాటు ఆమెతోపాటు యూఏఈకి చెందిన ఇషా ఓజా, థాయిలాండ్‌కు చెందిన తిపాట్చా పుట్టావోంగ్‌ కూడా అవార్డుకు పోటీపడుతున్నారు. ఇప్పటివరకు భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, స్మృతి మంధాన మంత్లీ అవార్డులు గెలిచారు.


Next Story