- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వినేశ్ ఫొగాట్' కు 'తీవ్ర' అన్యాయం.. సునీల్ గవాస్కర్
by Geesa Chandu |
పారిస్ ఒలింపిక్స్ లో 50 కేజీల స్వర్ణ పతక పోరులో అధిక బరువుతో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.!

X
దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో 50 కేజీల స్వర్ణ పతక పోరులో అధిక బరువుతో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.! అయితే రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అధిక బరువుతో అనర్హత వేటు వేయడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించి, నిరసన వ్యక్తం చేయాలని.. దిగ్గజ భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్ బుధవారం తన నిరాశను వ్యక్తం చేశాడు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తో పాటూ, భారత ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని త్వరగా పరిష్కరించాలని సూచనలు చేశారు. ఇది "అత్యంత దురదృష్టకరమని నేను భావిస్తున్నాను. ఆమెకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇది ప్రారంభ మ్యాచ్ కానే కాదు. అందువల్ల అధికారులు దీన్ని గమనించాలి. అనర్హతకు వ్యతిరేకంగా భారత్ తన గలాన్ని బలంగా వినిపించాలి" అని సునీల్ గవాస్కర్ ఈ సందర్భంగా అన్నారు.
Next Story






