- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asia Cup 2025: గిల్ కోసం బీసీసీఐ కుట్రలు... తెలుగోడిపై వేటు?
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా జట్టులోకి గిల్ వస్తే... తిలక్ వర్మ తప్పుకోవాల్సి వస్తుందని అంటున్నారు

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025) వచ్చే నెల ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో... రేపు టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ జట్టును పిసిబి ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. రేపు టీమిండియా జట్టును కూడా బీసీసీఐ ప్రకటించబోతోంది. ఈ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇస్తూ.. గిల్ కు ( Gill) వైస్ కెప్టెన్సీ ప్లాన్ చేస్తున్నారట అధికారులు.
క్రమ క్రమంగా కెప్టెన్సీ కూడా గిల్ కు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. వన్డేలకు కూడా గిల్ కెప్టెన్ అవుతాడు అన్నమాట. అంటే ఓవరాల్ గా మూడు ఫార్మాట్లకు కూడా గిల్ ను కెప్టెన్ చేసే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా జట్టులోకి గిల్ వస్తే... తిలక్ వర్మ ( Tilak verma) తప్పుకోవాల్సి వస్తుందని అంటున్నారు. తెలుగు కుర్రాడైన తిలక్ వర్మ... మూడవ స్థానంలో అద్భుతంగా రాణిస్తాడు. కానీ గిల్ రంగంలోకి దిగితే తిలక్ వర్మను సెలెక్ట్ చేయకపోవచ్చని ప్రాథమిక సమాచారం అందుతోంది. దీంతో తెలుగు అభిమానులు....బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






