- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐలోనే శత్రువులు ఉన్నారని భారత మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రెండు ఐసీసీ టైటిల్స్ గెలిచిన తర్వాత కూడా గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో జట్టు వైఫల్యాన్ని ఎత్తుచూపుతున్నారు. తన ముక్కుసూటి వైఖరితో కూడా అతను ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మునాఫ్.. గంభీర్ గురించి మాట్లాడాడు. హెడ్ కోచ్‌గా గంభీర్ వెళ్లిపోతే భారత జట్టు పరిస్థితులు అస్తవ్యస్తంగా మారుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘అతను భారత జట్టు సిస్టమ్‌ను నియంత్రించగలడు. ఏ ప్లేయరైనా తప్పు చేస్తే అతన్ని తొలగించే ధైర్యం గంభీర్‌కు ఉంది. అతను స్నేహితుడిగా ఉండలేదు. అలా ఉంటే సిస్టమ్‌ను నాశనం చేసినట్టే. గంభీర్‌కు ఎంత మంది శత్రువులు ఉన్నారో తెలుసా. కామెంటరీ ప్యానెల్‌లో 10 మందిలో 8 మందికి నచ్చడు. ఐదుగురు సెలెక్టర్లలో నలుగురు అతనికి వ్యతిరేకం. అయినప్పటికీ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.’అని మునాఫ్ తెలిపాడు. ‘ఒక్క విషయం గుర్తుంచుకోండి. గంభీర్‌ను తీసిస్తే ప్లేయర్లను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అతను నిజాయితీపరుడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాడు. చాలా మందికి అది నచ్చదు. గంభీర్ తప్ప ఇతర కోచ్‌లు ప్లేయర్లను హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే అతనికి భయపడతారు. గంభీర్‌కు మనీ కాదు క్రికెట్ అంటే ప్రేమ’అని మునాఫ్ చెప్పుకొచ్చాడు.






