- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నస్వామి స్టేడియంలో భద్రతా కలకలం.. CCTV ఫీడ్‌ను నిలిపివేసిన ఇద్దరు సిబ్బంది
ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు ముందు చిన్నస్వామి స్టేడియంలో భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తొక్కిసలాట ఘటనను మరువక ముందే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium)లో మరో భద్రతా వైఫల్యం బయటపడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ముందు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. స్టేడియంలోని భద్రతా వ్యవస్థలో కీలకమైన సీసీటీవీ (CCTV) కెమెరాలు ఇద్దరు సిబ్బంది పని చేయకుండా చేసినట్లుగా గుర్తించడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
అసలు జరిగింది ఇదే..
నేడు మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు భద్రతా తనిఖీలు నిర్వహిస్తుండగా.. స్టేడియంలోని పలు కీలక పాయింట్ల వద్ద కెమెరాలు పనిచేయడం లేదని తేలింది. కొన్ని కెమెరాలు ఉద్దేశపూర్వకంగా డిజేబుల్ చేశారా లేక సాంకేతిక లోపం వల్ల ఆగిపోయాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు సిబ్బందిని అదపులోకి తీసుకున్నారు. వేల సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే బిగ్ మ్యాచ్‌లో నిఘా వ్యవస్థలో భారీ లోపం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో బెంగళూరు సిటీ పోలీసులు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు తక్షణమే రంగంలోకి దిగారు. కెమెరాల కనెక్షన్లను పునరుద్ధరించేందుకు సాంకేతిక బృందం శ్రమిస్తోంది. అదనపు భద్రతా బలగాలను స్టేడియం లోపల, బయట మోహరించారు.






