బంగ్లాతో రెండో టెస్ట్: పట్టుబిగిస్తున్న టీమిండియా

by Rajesh |
బంగ్లాతో రెండో టెస్ట్:  పట్టుబిగిస్తున్న టీమిండియా
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగిస్తోంది. బౌలర్లు రాణించడంతో లంచ్ బ్రేక్ వరకు బంగ్లాదేశ్ 71 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. నజ్ముల్ హుస్సేన్ (5), మొమినుల్ హక్(5), షకీబ్(13), ముష్ఫికర్ రహీం(9) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అశ్విన్, సిరాజ్, అక్షర్ పటేల్, ఉనద్కట్ చెరో వికెట్ తీశారు. జాకీర్ హసన్ 37 పరుగులు, లిట్టన్ దాస్ 0 క్రీజులో ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా 314 పరుగులు చేసింది. పంత్, శ్రేయస్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ కు 87 పరుగుల ఆధిక్యం లభించింది. బంగ్లాదేశ్ 16 పరుగులు వెనకబడి ఉంది.

Also Read..

IPL 2023 వేలం: 80 మంది ఆటగాళ్లు.. ₹167 కోట్లు

Next Story