- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
శ్రీలంకతో రెండో వన్డే.. టీమిండియా ఘోర పరాజయం
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 42.2 ఓవర్లలో కేవలం 208 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(64), అక్షర్ పటేల్(44), శుభ్‌మన్ గిల్(35) రాణించారు. కోహ్లీ(14), దూబే(0), కేఎల్ రాహుల్(0), అయ్యర్(07) సహా కీలకమైన బ్యాటర్లంతా నిరాశపరిచారు. దీంతో లంక బౌలర్స్ భారత బ్యాటర్లపై పైచేయి సాధించారు. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో శ్రీలంక ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక రెండో వన్డేలో సమిష్టి పోరాంటతో మోస్తారు స్కోర్ చేసింది. భారత బౌలర్ల ధాటికి రెండొందల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన లంక 240 రన్స్ కొట్టింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(40), కమిందు మెండిస్(40) రాణించగా.. గత మ్యాచ్ హీరో దునిత్ వెల్లలాగే(39) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.