ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై స్కాట్లాండ్ ట్రోలింగ్.. ఈ వీడియో చూస్తే!

by velandi.Saikiran |

పాక్ స్పిన్న‌ర్ ఉస్మాన్ తారిక్ ను ఇమిటేట్ చేస్తూ స్కాట్లాండ్ ప్లేయ‌ర్లు కూడా అత‌నిలాగానే బౌలింగ్ చేశారు.

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై స్కాట్లాండ్ ట్రోలింగ్.. ఈ వీడియో చూస్తే!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అతని బౌలింగ్ యాక్షన్ వింతంగా ఉన్న‌త‌రుణంలో సోషల్ మీడియాలో ఉస్మాన్ పేరు మారుమోగుతోంది. అతనిపై చాలా మంది రీల్స్ కూడా చేస్తున్నారు. బౌలింగ్ యాక్షన్ డిఫరెంట్ గా ఉన్న నేపథ్యంలో మై విలేజ్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన బృందంతో పాటు సూర్య కుమార్ యాదవ్ కూడా ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను ఇమిటేట్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఉస్మాన్ తారిక్ ను ఇమిటేట్ చేస్తూ స్కాట్లాండ్ ప్లేయ‌ర్లు

పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తరహాలోనే స్కాట్లాండ్ బౌలర్లు కూడా బౌలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ వైరల్ అయిన నేపథ్యంలో అతన్ని ఇమిటేట్ చేస్తూ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు స్కాట్లాండ్ ప్లేయర్లు. కెప్టెన్ తో సహా బౌల‌ర్లు కూడా ఇదే రూట్ ఎంచుకున్నారు. బంతిని చాలాసేపు ఆపి, ఆ తర్వాత సంధించడం ఉస్మాన్ తారిక్ కు అలవాటు. దీంతో వికెట్లు అతనికి బాగా పడేవి. అయితే అతని బౌలింగ్ యాక్షన్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ గ్రీన్, భారత మాజీ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అతనిది సరైన బౌలింగ్ కాదని.. అలాంటి ఉస్మాన్ కు ఐసీసీ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కానీ అశ్విన్ లాంటి వారు మాత్రం ఉస్మాన్ తారిక్ కు అండగా నిలిస్తున్నారు. అతనిది సరైన బౌలింగ్ అని పేర్కొంటున్నారు.

Next Story