- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాటు కూడా ఎలా పట్టుకోవాలో తెలియని వారికి సభ్యత్వం ఇస్తారా?.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

దిశ, స్పోర్ట్స్ : బ్యాటు కూడా ఎలా పట్టుకోవాలో తెలియని వారికి సభ్యత్వం ఎలా ఇస్తారని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ)ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మాజీ క్రికెటర్లు చాలా మంది ఉన్నారని, వారిని సభ్యులుగా తీసుకుంటే తాము గౌరవించే వాళ్లమని వ్యాఖ్యానించింది. ఇటీవల ఎంసీఏ ఎన్నికలపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ఎంసీఏలో వ్యాపారవేత్తలు, ఆఫీస్ బేరర్ల బంధువులు సభ్యులుగా చేర్చుకున్నారని భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ బాంబే హైకోర్టు ఆశ్రయించగా.. ఈ నెల 6న జరగాల్సిన ఎన్నికలపై స్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి. బాంబే హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ ఎంసీఏ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. మంగళవారం పిటిషన్‌ను విచారించినన అత్యున్నత ధర్మాసనం స్టేను ఎత్తివేయడానికి నిరాకరించింది. 1986-223 వరకు ఎంసీఏలో 168 మంది సభ్యులే ఉండగా.. 2023 నుంచి 400 మంది కొత్త సభ్యులను చేర్చడాన్ని సుప్రీం కోర్టు గుర్తించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్టే సరైందేనని, మీరు పెద్ద మోసం చేయకుండా ముంబై హైకోర్టు ఆపిందని తెలిపింది. ‘తమ ప్రదర్శనలతో మన దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన వందలాంది మంది రిటైర్డ్ క్రికెటర్లు ఉన్నారు. మాజీ క్రికెటర్లను సభ్యులుగా తీసుకుని ఉంటే మేము మీ ఎన్నికల మెంబర్‌షిప్ డ్రైవ్‌ను గౌరవించే వాళ్లం. కానీ, దురదృష్టవశాత్తూ మీరు బ్యాట్ కూడా ఎలా పట్టుకోవాలో తెలియని వారికి సభ్యత్వం ఇచ్చారు. క్రీడాకారులే స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో భాగస్వామ్యం కావాలి.’అని వెల్లడించింది. పిటిషన్ బాంబే హైకోర్టులో పెండింగ్ ఉందని, ఎంసీఏ అక్కడే వాదించుకోవాలని సుప్రీం కోర్టు తెలిపింది.






