- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొఫెషనల్ స్క్వాష్‌కు సౌరవ్ ఘోషల్ వీడ్కోలు
భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ఫ్రొఫెషనల్ స్క్వాష్‌కు వీడ్కోలు పలికాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ఫ్రొఫెషనల్ స్క్వాష్‌కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల సౌరవ్ సోమవారం సోషల్ మీడియా వేదికగా 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘22 ఏళ్ల క్రితం నా కెరీర్ మొదలైంది. అప్పుడు ప్రొఫెషనల్ స్కాష్‌లో సుదీర్ఘ కాలం ఆడతానని అనుకోలేదు. కానీ, ప్రతి దానికి ముగింపు ఉంటుంది. ఫ్రొఫెషనల్ స్కాష్ అసోసియేషన్(పీఎస్‌ఏ)కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా.’ అని తెలిపాడు. అయితే, ఇది స్క్వాష్‌కు పూర్తిగా వీడ్కోలు పలికినట్టు కాదని, తాను దేశం తరపున మరికొంత కాలం ఆడతానని పేర్కొన్నాడు. కాగా, ఘోషల్ తన కెరీర్‌లో 10 పీసీఏ టైటిల్స్ సాధించాడు. అంతేకాకుండా, టాప్-10 వరల్డ్ ర్యాంకింగ్స్‌లో నిలిచిన ఏకైక భారత ఆటగాడు అతనే. వరల్డ్ డబుల్స్ చాంపియన్‌షిప్-2022లో మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో సౌరవ్ స్వర్ణం సాధించాడు. అదే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్, సింగిల్స్ కేటగిరీల్లో కాంస్యం సాధించగా.. ఆసియా క్రీడల్లో టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం, సింగిల్స్‌లో రజతం గెలుచుకున్నాడు.






