ఇంగ్లాండ్ టూరు కోసం కష్టపడుతున్న సర్ఫరాజ్ ఖాన్.. అవి మాత్రమే తింటూ 10 కిలోలు తగ్గాడు

by Harish |

టీమ్ ఇండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్ గడ్డపై సత్తాచాటి తిరిగి సీనియర్ జట్టులోకి రావాలని చూస్తున్నాడు.

ఇంగ్లాండ్ టూరు కోసం కష్టపడుతున్న సర్ఫరాజ్ ఖాన్.. అవి మాత్రమే తింటూ 10 కిలోలు తగ్గాడు
X

దిశ, స్పోర్ట్స్ : భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌లో ప్రతిభకు కొదవలేదు. కానీ, లావుగా ఉన్నాడన్న విమర్శలను కూడా అతను ఎదుర్కొంటున్నాడు. ప్రతిభ ఉన్నా ఫిట్‌గా లేకపోవడం వల్లే ఎక్కువ అవకాశాలు రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. ఏకంగా 10 కిలోలు తగ్గాడు. ఇటీవల ఇంగ్లాండ్ టూరు కోసం ప్రకటించిన భారత ‘ఏ’ జట్టులో అతనికి చోటు దక్కిన విషయం తెలిసిందే. అతనికి ఇదే తొలి విదేశీ టూరు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై సత్తాచాటి తిరిగి సీనియర్ జట్టులోకి రావాలని చూస్తున్నాడు. అందుకోసం సర్ఫరాజ్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. ముఖ్యంగా కఠినమైన డైట్ ప్లాన్‌ను పాటిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఉడకపెట్టిన కూరగాయాలు, చికెన్ మాత్రమే తీసుకుంటున్నాడు. దీంతో అతను 10 కిలోలు బరువు తగ్గాడు. అలాగే, రోజులో రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ స్వింగ్ పరిస్థితులకు అనుగుణంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్‌ బంతులను ప్రాక్టీస్ చేస్తున్నాడు. గతేడాది సర్ఫరాజ్ ఖాన్ టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో 371 రన్స్ చేశాడు. అందులో ఓ సెంచరీతోపాటు మూడు అర్ధ శతకాలు ఉన్నాయి.


Next Story