భార‌త జ‌ట్టుకు షాక్‌..ఆస్ప‌త్రి పాలైన స్టార్ ప్లేయ‌ర్ !

by velandi.Saikiran |

సర్ఫరాజ్ ఖాన్ ఆసుపత్రిలో పడడం ముంబైకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అయితే, రేపటి వరకు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ కోలుకుంటాడని ముంబై జట్టుకు సంబంధించిన ప్రతినిధులు చెబుతున్నారు.

భార‌త జ‌ట్టుకు షాక్‌..ఆస్ప‌త్రి పాలైన స్టార్ ప్లేయ‌ర్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత జట్టుకు సంబంధించిన స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ( Sarfaraz Khan) గురించి తెలియని వారు ఉండరు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సర్ఫరాజ్ ఖాన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మినీ వేలంలో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. అయితే ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2026 టోర్నమెంటులో ( Ranji Trophy Elite 2025-26 ) ఆడుతూ అన్న సర్ఫరాజ్ ఖాన్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో సర్ఫరాజ్ ఖాన్ చేరినట్లు తెలుస్తోంది. హోటల్ ఫుడ్ పడకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్ కు వైరల్ ఫీవర్ వచ్చినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆసుపత్రి పాలైన సర్ఫరాజ్ ఖాన్.. టెన్షన్ లో ముంబై

రంజీ ట్రోఫీ 2026 టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా క్వార్ట‌ర్‌ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన అంటే రేపు జరగనుంది. ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై వర్సెస్ కర్ణాటక (Mumbai vs Karnataka ) మధ్య ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ షరద్ పవార్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ ఆసుపత్రిలో పడడం ముంబైకి మింగుడు పడడం లేదు. ముంబై జట్టులో చాలా కీలక ప్లేయర్ గా స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ ఎదిగాడు.

మొన్న హైదరాబాద్ జట్టు పైన డబుల్ సెంచరీ కూడా చేశాడు సర్ఫరాజ్ ఖాన్. ఇలాంటి నేపథ్యంలోనే సర్ఫరాజ్ ఖాన్ ఆసుపత్రిలో పడడం ముంబైకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అయితే, రేపటి వరకు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ కోలుకుంటాడని ముంబై జట్టుకు సంబంధించిన ప్రతినిధులు చెబుతున్నారు. ఇది సాధారణమైన వైరల్ ఫీవర్ అని అంటున్నారు. కాగా ముంబై జట్టుకు శార్దూల్ ఠాకూర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటు కర్ణాటక జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో గెలిచిన జట్లు సెమీ ఫైనల్ కు దూసుకువెళ్తాయి.

చెన్నై సూప‌ర్ కింగ్స్ లోకి సర్ఫరాజ్ ఖాన్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మినీ వేలంలో సర్ఫరాజ్ ఖాన్ కు అదిరిపోయే ఆఫర్ దక్కింది. మొన్న జరిగిన ఈ మినీ వేలంలో అతన్ని ఎవరు కొనుగోలు చేయలేదు. అయితే సెకండ్ రౌండ్ లో మాత్రం సర్ఫరాజ్ ఖాన్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. కేవలం 75 లక్షలు పెట్టి మరీ, అతన్ని సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఐపీఎల్ 2026 టోర్నమెంటులో అతనికి తుది జట్టులో అవకాశం రాకపోవచ్చు అని అంటున్నారు. అయితే, మ‌హేంద్ర సింగ్ ధోని ఫోక‌స్ చేస్తే, అత‌నికి మంచి అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చెబుతున్నారు.


Next Story