- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియా క్రికెటర్ చెల్లెలితో సారా డీలింగ్..ఒకే కారులో!
గిల్ సోదరి షహనీల్ గిల్ ను తాజాగా సారా టెండూల్కర్ కలిసినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ

దిశ, వెబ్ డెస్క్: సచిన్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సినిమా ఇండస్ట్రీ లోకి గానీ లేదా క్రికెట్ లోకి రాకముందే పాపులర్ అయిపోయారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కూతురు అన్న బ్రాండ్ తో... పెద్ద సెలబ్రిటీ అయిపోయారు సారా టెండూల్కర్. దానికి తోడు.. టీమిండియా యంగ్ క్రికెటర్ గిల్ తో సారా టెండూల్కర్ ప్రేమాయణం నడిపించినట్లు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు ఈ వార్తలపై ఈ ఇద్దరు స్పందించలేదు. వార్తలను ఖండించలేదు. దీంతో ఈ ఇద్దరు ప్రేమలోనే ఉన్నారని.. ఇప్పటికీ రకరకాల పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే సారా టెండూల్కర్ గురించి కొత్త విషయం బయటకు వచ్చింది. గిల్ సోదరి షహనీల్ గిల్ ను తాజాగా సారా టెండూల్కర్ కలిసినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ వివరాలు, ఫ్యూచర్ గురించి ఇద్దరు చర్చించుకున్నారట. ఇందులో గిల్ గురించి కూడా మ్యాటర్ వచ్చిందట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి.






