- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీఈపీఎల్‌లో జట్టును కొన్న సారా టెండుల్కర్
జియో సినిమా, స్పోర్ట్స్ 18లలో 70 మిలియన్లకు పైగా వ్యూస్.. 2.4 మిలియన్ నిమిషాల స్ట్రీమింగ్ కంటెంట్‌తో ఈ-స్పోర్ట్స్ విభాగంలో జీఈపీఎల్ అగ్రగామిగా ఎదిగింది.

- ముంబై జట్టుకు ఓనర్ అయిన సచిన్ కూతురు
- ఈ-స్పోర్ట్స్‌లో లీడర్‌గా ఎదుగుతున్న జీఈపీఎల్
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండులక్కర్ కూమార్తె సారా టెండుల్కర్ పాపులర్ ఈ-స్పోర్ట్ గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ (జీఈపీఎల్)లో ఒక ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. త్వరలో సెకెండ్ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ఆమె ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ఈ-క్రికెట్, ఎంటర్‌టైన్‌మెంట్ లీగ్‌గా ఎదిగిన జీఈపీఎల్‌లో రియల్ టైంలో క్రికెట్ ఆడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ గేమ్‌కు 300 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. మొదటి సీజన్ నుంచే ఈ-స్పోర్ట్‌కు మంచి ఆదరణ లభించింది. తొలి సీజన్‌లో 2,00,000 మంది ప్లేయర్లు ఉండగా.. ప్రస్తుతం రెండో సీజన్ కోసం 9,10,000 మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జియో సినిమా, స్పోర్ట్స్ 18లలో 70 మిలియన్లకు పైగా వ్యూస్.. 2.4 మిలియన్ నిమిషాల స్ట్రీమింగ్ కంటెంట్‌తో ఈ-స్పోర్ట్స్ విభాగంలో జీఈపీఎల్ అగ్రగామిగా ఎదిగింది.
'మా కుటుంబం క్రికెట్‌లో ఒక అంతర్భాగం. ఈ-స్పోర్ట్స్‌లో కూడా ప్రవేశించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. జీఈపీఎల్‌లో ముంబై ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడం ద్వారా నా కలనిజమైంది. ఆట పట్ల నాకు ఉన్న మక్కువ, నగరం పట్ల నాకున్న ప్రేమే ఈ కొనుగోలుకు కారణం. స్పూర్తిని, వినోదాన్ని అందించే ఈ-స్పోర్ట్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడం ఆందంగా ఉంది. ప్రతిభావంతులైన బృందంతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాను' అని సారా టెండుల్కర్ పేర్కొన్నారు. కాగా, సారా సోదరుడు అర్జున్ టెండుల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్న అర్జున్.. రంజీల్లో గోవా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.






