- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిల్ కాదు..అతని వల్లే శాంసన్ ఆడలేడు: ఇర్ఫాన్ పఠాన్
ఆసియా కప్‌లో సంజూ శాంసన్ స్థానంలో శుభ్‌మన్ గిల్ ఆడతాడని, అయితే దీనికి కారణం గిల్ కాదని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.

దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్‌లో సంజూ శాంసన్ ఆడటం కష్టమేనని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. టీ20ల్లోకి శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడంతో సంజూ శాంసన్ స్థానంపై ప్రశ్నలు తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో గిల్ కన్నా కూడా మరో ప్లేయర్ ప్రభావమే ఎక్కువగా ఉందని పఠాన్ చెప్పాడు. ‘సంజూ అద్భుతంగా ఆడుతున్నాడు. అంత నిలకడ లేకపోయినా రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్ కూడా చెయ్యగలడు కాబట్టి అభిషేక్ కచ్చితంగా ఆడతాడు. తన స్ట్రైక్ రేటు కూడా మామూలుగా లేదు.
కానీ జితేశ్ శర్మ కూడా టీంలో ఉన్నాడు కదా. దీంతో కీపర్‌గా అతన్ని తీసుకొని గిల్‌తో ఓపెనింగ్ చేయిస్తారని అనుకుంటున్నా. అప్పుడు శాంసన్ ఆడటం కుదరదు’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు. జితేశ్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అతను జట్టులో లేకపోతే తప్పనిసరిగా సంజూనే ఆడించాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ సంజూ కూడా ఐదో స్థానంలో ఆడేందుకు రెడీ అయితే.. అప్పుడు జితేశ్‌కు ఆడే అవకాశం రాదని వివరించాడు.






