CSKకు ఎదురుదెబ్బ.. సంజు శాంసన్ షాకింగ్ నిర్ణయం !

by velandi.Saikiran |

చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంజు

CSKకు ఎదురుదెబ్బ.. సంజు శాంసన్ షాకింగ్ నిర్ణయం !
X

దిశ, వెబ్ డెస్క్ : చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంజు శాంసన్ (Sanju Samson ) వెళ్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అప్పగించి... మరికొన్ని డబ్బులు ఇచ్చి మరి సంజు శాంసన్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేయాలని.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం భావించింది.

దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కూడా తెగ సంబరపడిపోయారు. ఇలాంటి నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం, అభిమానులకు ఊహించని ఝలక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజు శాంసన్... రాజస్థాన్ రాయల్స్ జట్టులోనే కొనసాగుతాడని.. 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కెప్టెన్ గా కూడా ఉంటాడని.. ఆ జట్టు యాజమాన్యం వెల్లడించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సంజు శాంసన్ ను వదులుకునేది లేదని RR యాజమాన్యం స్పష్టం చేసిందట. దీంతో చెన్నై అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Next Story