- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CSK భారీ స్కెచ్.. 9 కోట్లు పెట్టి ఆ డేంజర్ ప్లేయర్ ను దించుతోంది!
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( Chennai Super Kings) అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి

దిశ, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( Chennai Super Kings) అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సరికొత్త ప్లేయర్ రాబోతున్నాడట. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ( IPL 2025) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అత్యంత దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఐపిఎల్ 2026 ( IPL 2026) టోర్నమెంటులో బాగా రాణించి టైటిల్ గెలవాలని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు... భారీ ప్లాన్ వేస్తోంది.
దీని కోసం... సంజూ శాంసన్ ను ( Sanju Samson) బరిలోకి దింపేందుకు స్కెచ్ వేసింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న సంజూ శాంసన్ ను... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు... రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంతో కూడా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సంజూ శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకొని.. రవిచంద్రన్ అశ్విన్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి పంపేందుకు ప్లాన్ చేస్తున్నారట.
అంతేకాదు అదనంగా మరో 9 కోట్లు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇచ్చేందుకు బిగ్ స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. దీనికి సంజూ శాంసన్ కూడా ఒప్పుకున్నాడని సమాచారం. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోకి సంజూ శాంసన్ వస్తే... అతనికి వైస్ కెప్టెన్సీ ఇస్తారని ప్రచారం జోరు అందుకుంది. రుతురాజ్ ఎప్పటిలాగే కెప్టెన్ గా కొనసాగుతాడని అంటున్నారు. ఇక మహేంద్రసింగ్ ధోని మాత్రం.. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
instagamme link






