- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ టోర్నీ వేలంలో శాంసన్‌కు రికార్డు ధర.. ఎంత పలికాడో తెలుసా?
కేరళ ప్రీమియర్ లీగ్(కేసీఎల్)లో టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌కు రికార్డు ధర పలికింది.

దిశ, స్పోర్ట్స్ : కేరళ ప్రీమియర్ లీగ్(కేసీఎల్)లో టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌కు రికార్డు ధర పలికింది. అతన్ని రూ.26.80 లక్షలకు కొచ్చి బ్లూ టైగర్స్ జట్టులోకి తీసుకుంది. రూ.3 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతను వేలంలోకి వచ్చాడు. శాంసన్ కోసం త్రిస్పూర్ టైటాన్స్ కూడా పోటీపడింది. రూ.20 లక్షలు బిడ్ వేసింది. కానీ, కొచ్చి బ్లూ టైగర్స్ రికార్డు బిడ్ వేసింది. దీంతో కేసీఎల్ లీగ్ చరిత్రలోనే శాంసన్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. వేలంలో ప్రతి జట్టు బిడ్డింగ్ మొత్తం రూ.50 లక్షలు. ఒక జట్టు గరిష్టంగా రూ. 50 లక్షలు మాత్రమే ఖర్చు చేయగలదు. కొచ్చి బ్లూ టైగర్స్ తమ మొత్తం నుంచి సగానికిపైగా డబ్బును శాంసన్‌పైనే ఖర్చు చేయడం గమనార్హం. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున శాంసన్ రూ.18 కోట్లు అందుకున్నాడు. కేసీఎల్‌లో శాంసన్ తర్వాత విష్ణు వినోద్ రెండో అత్యంత ఖరీదై ప్లేయర్‌గా నిలిచాడు. అతన్ని ఆరీస్ కొల్లం రూ.13.8 లక్షలకు తీసుకుంది.






