- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
9 మ్యాచ్ లలో చెత్త ప్రదర్శన..సంజు శాంసన్ ఔట్, కొత్త ఓపెనర్ వచ్చేస్తున్నాడు !
వరుసగా 9 ఇన్నింగ్స్ లలో అట్టర్ ఫ్లాప్ అయిన సంజు శాంసన్ స్థానంలో డేంజర్ ఆటగాడు ఇషాన్ కిషన్ కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్.

దిశ, వెబ్ డెస్క్: టీ20 క్రికెట్ లో వరుసగా అవకాశాలు దక్కించుకున్న సంజు శాంసన్ పై ఇప్పుడు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఒకప్పుడు సంజు శాంసన్ కు అవకాశాలు ఇవ్వడం లేదని బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులే, ఇప్పుడు సంజు శాంసన్ ను బండ బూతులు తిడుతున్నారు. న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో చెత్త ప్రదర్శన కనబరిచాడు సంజు శాంసన్. ఒక్క మ్యాచ్ లో కూడా సరిగ్గా ప్రదర్శన కనబరచలేదు. అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అంతేకాదు 2025 జూన్ మాసం నుంచి ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ లలో సంజు చేసింది 104 పరుగులు మాత్రమే. స్ట్రైట్ రేట్ 133 కాగా, యావరేజ్ 11 మాత్రమే ఉంది. ఇందులో హైయెస్ట్ స్కోర్ కేవలం 37 పరుగులు మాత్రమే. దీంతో భారత జట్టు నుంచి సంజు శాంసన్ ను తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సంజు శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్?
వరుసగా 9 ఇన్నింగ్స్ లలో అట్టర్ ఫ్లాప్ అయిన సంజు శాంసన్ స్థానంలో డేంజర్ ఆటగాడు ఇషాన్ కిషన్ కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్. ఎలాగూ టీ20 జట్టులోకి తిలక్ వర్మ త్వరలో రాబోతున్నాడు. అతని మూడవ స్థానంలో ఆడించి, ఇశాన్ కిషన్ కు ఓపెనర్ గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సంజు శాంసన్ ను తుది జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సంజూ స్థానంలో ఇశాన్ కిషన్ ఓపెనర్ గా అలాగే కీపర్ గా కూడా పనికి వస్తాడని సూచనలు చేస్తున్నారు. మరి దీనిపై బీసీసీఐ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.






