- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధోనీతో కలిసి ఆడేందుకు ఎదురు చూస్తున్నా: సంజూ శాంసన్
ధోనీతో కలిసి ఆడేందుకు ఎదురు చూస్తున్నానని సంజూ శాంసన్ అన్నాడు. సీఎస్కే తరఫున ఆడేందుకు ఎగ్జయిట్ అయ్యాడు.

దిశ, స్పోర్ట్స్: చెన్నయ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు తను చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నట్లు సంజూ శాంసన్ వెల్లడించాడు. ముఖ్యంగా ఎంఎస్ ధోనీతో డ్రెస్సింగ్ రూం పంచుకోవడానికి ఎదురు చూస్తున్నానని చెప్పిన అతను.. ధోనీని తను మొదటి సారి కలిసిన సమయాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘నాకు 19 ఏళ్ల వయసులో టీమిండియాకు తొలిసారి సెలెక్ట్ అయ్యా. అప్పుడు ధోనీ కెప్టెన్సీలో యూకే టూర్‌కు వెళ్లాం. అప్పుడే తనను మొదటిసారి చూశా. 10-20 రోజులు ధోనీతో కలిసి ప్రయాణించా. ఆ తర్వాత ఐపీఎల్‌లో చాలాసార్లు చూసినా.. ఎప్పుడు కలుద్దామన్నా కనీసం 10 మంది ధోనీ చుట్టూ ఉంటారు. సరే మళ్లీ కలుద్దాం అనుకుంటూ ఉండిపోయేవాడిని’ అని చెప్పుకొచ్చాడు.
అదృష్టం కొద్దీ ఇప్పుడు ధోనీతో డ్రెస్సింగ్ రూం పంచుకునే అవకాశం వచ్చిందన్నాడు. మళ్లీ ధోనీ కలిసి ప్రయాణించే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ‘ధోనీతో కలిసి ఆడాలని నాకెప్పుడూ కోరిక ఉండేది. ఇప్పుడు నా అదృష్టంకొద్దీ ఆ కోరిక నెరవేరుతోంది. ఈ రెండు, మూడు నెలలు ధోనీని కలవడం, తనతో కలిసి బ్రేక్‌ఫాస్ట్, ప్రాక్టీస్.. కలిసి ఆడటం.. ఇవన్నీ తలచుకుంటేనే సంతోషంగా ఉంది’ అని ఎగ్జయిట్ అయిపోయాడీ కేరళ స్టార్. ఇంతకాలం రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన అతన్ని.. రవీంద్ర జడేజా, శామ్ కర్రాన్‌తో చెన్నయ్ ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.






