- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళలో అడుగు పెట్టిన సంజు...ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్ తోపులాట!
సోమవారం తన సొంత గడ్డ తిరువనంతపురంలో అడుగు పెట్టాడు భారత స్టార్ ఆటగాడు సంజు శాంసన్.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంతో తన సొంత గడ్డ కేరళ రాష్ట్రంలో అడుగు పెట్టాడు వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ సంజు శాంసన్. ఈ సందర్భంగా సంజుకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వ పెద్దలు, సంజు శాంసన్ అభిమానులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వరల్డ్ కప్ గెలిచిన అనంతరం, సోమవారం తన సొంత గడ్డ తిరువనంతపురంలో అడుగు పెట్టాడు భారత స్టార్ ఆటగాడు సంజు శాంసన్.
సంజుతో పాటు ఆయన భార్య కూడా వచ్చారు. ఈ సందర్భంగా తిరువనంతపురం విమానాశ్రయం దగ్గర అభిమానులు బ్రహ్మరథం పట్టారు. వేలాది సంఖ్యలో సంజును చూసేందుకు ఎగబడ్డారు అభిమానులు. ఈ సందర్భంగా కాస్త తోపులాట కూడా జరిగింది. సంజుతో కొంతమంది అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. అభిమానులను పోలీసులు కట్టడి చేశారు. ఈ సందర్భంగా కాస్త ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇక అటు తిరుమనంతపురం విమానాశ్రయంలో అడుగుపెట్టిన సంజుకు కేరళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శివం కుట్టి, ఎంపీ రహీం పుష్పగుచ్చం ఇచ్చి, ఆయనను ఆహ్వానించారు.
సంజుకు కేరళ ప్రభుత్వం అరుదైన గౌరవం
టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించి భారత జట్టును ఛాంపియన్ గా నిలపడంలో ఓపెనర్ సంజు శాంసన్ పాత్ర అంతా కాదు. కీలక దశలో భారత జట్టులో స్థానం దక్కించుకున్న సంజు, ప్రత్యర్థులను చీల్చి చెండాడాడు. సూపర్ 8లో వెస్టిండీస్ పై అదరగొట్టిన సంజు, సెమీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించాడు. ఇక ఫైనల్స్ లో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ, భారీ స్కోర్ మాత్రం సాధించాడు. ఇలా కీలకమైన దశలో భారత జట్టులో స్థానం దక్కించుకొని, టైటిల్ అందించాడు సంజు. ఈ నేపథ్యంలోనే సంజు చేసిన సేవలకు గాను తిరువనంతపురంలో అధికారిక పౌర సన్మానాన్ని నిర్వహించేందుకు కేరళ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం ఈ వారంలో ఉండే ఛాన్స్ ఉంది. కాగా ఈ టి 20 ప్రపంచకప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా సంజు నిలిచాడు.






