- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంజూ vs గిల్.. ఆసియా కప్‌లో ఆడేది ఒకరే?
ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ ఉన్నారు. వీరిలో తుదిజట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్ ఇద్దరికీ చోటు దక్కింది. ఇద్దరూ టాపార్డర్ ప్లేయర్లే అవడంతో ఎవరు ఆడతారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. టీమిండియా ఓపెనర్‌గా శాంసన్ ఆకట్టుకోవడంతో అతన్ని కొనసాగించినట్లు కనిపిస్తోంది. అయితే లెఫ్ట్, రైట్ కాంబినేషన్‌కు మక్కువ చూపే గంభీర్.. గిల్‌ను ఆడించాలంటే కచ్చితంగా సంజూనే తప్పిస్తాడని అంతా అనుకుంటున్నారు. దీనిపై అగార్కర్ కూడా కొంత హింట్ ఇచ్చాడు. జైస్వాల్, గిల్ లేకపోవడంతోనే సంజూకు ఆడే చాన్స్ దక్కిందన్నాడు. కాకపోతే ఇప్పుడు అందరూ ఫామ్‌లో ఉన్నారు కాబట్టి ఎవరిని ఆడించాలనే నిర్ణయం కోచ్, కెప్టెన్ కలిసి తీసుకుంటారని తప్పించుకున్నాడు. ఇదంతా విన్న నిపుణులు.. గిల్ కోసం సంజూను పక్కన పెట్టేసే అవకాశం ఉందని అంటున్నారు.
గిల్ ఆడతాడా?
వైస్ కెప్టెన్‌గా నియమించినా కూడా గిల్ ఆడటంపై అనుమానాలున్నాయి. దేశవాళీల్లో, ఐపీఎల్‌లో, అంతర్జాతీయ క్రికెట్లో.. అన్నిచోట్లా టాపార్డర్‌లోనే గిల్ రాణించాడు. ఇప్పుడు అతన్ని ఆడించాలంటే సెటిల్డ్‌గా ఉన్న టీమిండియా టాపార్డర్‌కు టింకరింగ్ చేయాల్సి ఉంటుంది. మొదటి బంతి నుంచే విధ్వంసం సృష్టించే అభిషేక్ శర్మ, మెచ్యూరిటీతోపాటు నిలకడ చూపిస్తున్న సంజూ శాంసన్.. ఇద్దరూ ఓపెనింగ్ స్పాట్‌లు తమ సొంతం చేసేసుకున్నారు.
ఇక మూడో స్థానంలో వరుస పెట్టి సెంచరీలు బాదిన తిలక్ వర్మ ఉన్నాడు. అతని ఫామ్ చూసిన తర్వాత తిలక్‌ను రిప్లేస్ చేసే ఆలోచనే లేదని సూర్యకుమార్ యాదవ్ కూడా తేల్చిచెప్పాడు. అలాంటప్పుడు టాపార్డర్ ప్లేయర్ అయిన గిల్‌ను ఏ స్థానంలో ఆడిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. పేరుకే వైస్ కెప్టెన్సీ ఇచ్చి, అతన్ని బెంచ్‌కే పరిమితం చేస్తారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో రిషభ్ పంత్ విషయంలో గంభీర్ ఇలాగే చేసిన సంగతి తెలిసిందే.






