- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంత్ వికెట్.. ఛీ ఛీ అంటూ వెళ్లిపోయిన సంజీవ్ గోయెంకా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మరోసారి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. మొన్నటి

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మరోసారి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. మొన్నటి మెగా వేలంలో 27 కోట్లు పలికిన పంత్ ( Rishabh Pant).. ఇప్పటివరకు పెద్దగా మెరువలేదు. ప్రతి మ్యాచ్ లో... దారుణంగా విఫలమవుతున్నాడు. తాజాగా జరిగిన హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్ లో కూడా... లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ నిరాశపరిచాడు.
ఈ మ్యాచ్ లో ఆరు బంతులు ఆడిన పంత్... కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశారు. ఇందులో ఒకే ఒక్క బౌండరీ ఉంది. అయితే... మలింగ బౌలింగ్ లో పంత్ కాటన్ బౌల్డ్ కావడంతో.. లక్నో ఓనర్ సంజీవ్ ( Sanjiv Goenka) షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అప్పటివరకు బాల్కనీలో ఉన్న సంజీవ్... లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కోల్పోగానే వెంటనే... డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. పంత్ ఏ మాత్రం సరిగ్గా ఆడడం లేదని... తన కదలికలతో... అందరికీ అర్థమయ్యేలా చేశాడు సంజీవ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా ఈ మ్యాచ్ లో ఓడిపోయిన లక్నో ఇంటిదారి పట్టింది.
only rishabh pant could flip my pov and make me feel for sanjeev goenka. 😭— Sneहाहाहा (@__Sn_e_ha__) May 19, 2025






