కోహ్లీని చాలాసార్లు కలిశా... సంజయ్ బంగర్ కుమార్తె ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Ajay Maddhiboyina |

భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ క్లోహ్లీ గురించి చెబుతూ తాను బ్యాటింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కోహ్లీని చాలాసార్లు కలిశా... సంజయ్ బంగర్ కుమార్తె ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ క్లోహ్లీ గురించి చెబుతూ తాను బ్యాటింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అనయ బంగర్ నిజానికి ఒకప్పుడు అబ్బాయిగా ఉండేది. కానీ అమ్మాయి లక్షణాలు ఉండటంతో ట్రాన్స్ జెండర్‌గా మారి అనయగా పేరు మార్చుకుంది. కాగా తాజాగా అనయ కోహ్లీ గురించి చెబుతూ అతడి వద్ద శిక్షణ తీసుకున్నట్టు తెలిపింది. తన తండ్రితో కలిసి కోహ్లీ దగ్గరకు వెళ్లేదానినని చెప్పింది. తన బ్యాటింగ్ కోహ్లీ చూశాడని తనకు కొన్ని టిప్స్ చెప్పాడని తెలిపింది.

కోహ్లీ బ్యాటింగ్ కూడా దగ్గర నుండి చూసే అదృష్టం త‌న‌కు ద‌క్కింద‌ని సంతోషం వ్య‌క్తం చేసింది. తీవ్ర‌మైన ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేస్తావ‌ని కోహ్లీని అడిగాన‌ని, త‌న బ‌లాల‌ను పూర్తిగా న‌మ్ముకుని ప్రాక్టీస్ చేస్తాన‌ని చెప్పాడ‌ని తెలిపింది. ఇదిలా ఉంటే అన‌య కూడా గ‌తంలో దేశీవాలీలో క్రికెట్ ఆడింది. మ‌హిళ క్రికెట్ టీంలోనూ ఆడాలని అనుకుంది. కానీ ఐసీసీ ట్రాన్స్‌జెండర్లకు అవకాశం ఇవ్వకపోవడంతో తప్పుకుంది. అంతే కాకుండా గతంలో తాను తోటి క్రికెటర్ల నుండి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పి అనయ ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను సంపాదించుకుంది.

Next Story