- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒంటరి తల్లిగా జీవించడం సులభం కాదు.. విడాకుల జీవితంపై సానియా మీర్జా కీలక వ్యాఖ్యలు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, తన భర్త పాకిస్తాన్ స్టార్ క్రికెట్ అయిన షోయబ్ మాలిక్ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza), తన భర్త పాకిస్తాన్ స్టార్ క్రికెట్ అయిన షోయబ్ మాలిక్ (Shoaib Malik) వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నాటి నుంచి తన కుమారుడితో ఒంటరిగా జీవిస్తుంది. కాగా ఒంటరి తల్లిగా జీవించడం సులభం కాదని, విడాకుల జీవితం (life of divorce)పై సానియా మీర్జా చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. తన వ్యక్తిగత జీవితంపై అరుదుగా మాట్లాడే ఆమె.. తాజాగా దర్శకురాలు ఫరా ఖాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో తన మనసు విప్పారు. “ఒంటరి తల్లిగా జీవించడం చాలా కష్టం. ప్రతి రోజు ఒక కొత్త సవాల్ ఎదురవుతుంది” అని సానియా వెల్లడించారు. విడాకుల తర్వాత తన కుమారుడు ఇజ్హాన్‌కి తల్లి, తండ్రి బాధ్యతలను తానె భరిస్తున్నానని చెప్పారు.
గతంలో పానిక్ అటాక్ వచ్చిన సమయంలో ఫరా ఖాన్ తనకు బలంగా అండగా నిలిచిందని గుర్తుచేశారు. దీనిపై ఫరా ఖాన్ కూడా సానియా ధైర్యాన్ని, బలాన్ని ప్రశంసిస్తూ “ఆమె నిజమైన ఫైటర్. జీవితంలో ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నా ధైర్యం గా నిలబడుతుంది” అని వ్యాఖ్యానించారు. విడాకుల ప్రభావం పిల్లలపై తప్పక ఉంటుందని సానియా కూడా అంగీకరించారు. “తల్లి, తండ్రి కలిసి ఉండడం పిల్లల కోసం ఉత్తమం. కానీ జీవిత పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు” అని ఆమె చెప్పింది. ప్రస్తుతం సానియా తన కుమారుడితో హైదరాబాదులో స్థిరపడుతూ, కొత్త జీవన మార్గాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు.






