సానియా మీర్జాకు సెకండ్ మ్యారేజ్.. వరుడు టాలీవుడ్ హీరోనే..?

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-17 12:58:47  IST  )

టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. కొడుకు పుట్టిన తర్వాత అతనితో విడిపోయింది. ప్రస్తుతం ఒంటరిగానే కొడుకును పెంచుతుంది. అప్పుడప్పుడు కొడుకుకు సంబంధించిన ఫొటోలు సోషల్

సానియా మీర్జాకు సెకండ్ మ్యారేజ్.. వరుడు టాలీవుడ్ హీరోనే..?
X

దిశ, వెబ్ డెస్క్ : టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. కొడుకు పుట్టిన తర్వాత అతనితో విడిపోయింది. ప్రస్తుతం ఒంటరిగానే కొడుకును పెంచుతుంది. అప్పుడప్పుడు కొడుకుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతుంది. అయితే ఈ భామ.. మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రముఖ టాలీవుడ్ హీరోతో సెకండ్ మ్యారేజ్ జరగబోతుందని.. త్వరలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది.

కాగా టాలీవుడ్ హీరో, సానియా ఓ కాఫీ షాపునకు డేటింగ్‌కు వెళ్లారనే టాక్ కూడా ఉంది. ఆ తర్వాతే పెళ్లి అనే రూమర్స్ మొదలయ్యాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ నిప్పు లేనిదే పొగరాదు కదా అనేవారు లేకపోలేదు. మొత్తానికి సానియా ఓ ఇంటిది అయితే అందుకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి అభిమానులకు. సో.. ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నారు.

Next Story