- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబాయ్ లో సానియా మీర్జాకు భయానక అనుభవం..ఇంటిపై నుంచే యుద్ధ విమానాలు !
దుబాయ్ లో సానియా మీర్జాకు భయానక అనుభవం ఎదురైంది. తన ఇంటిపై నుంచే యుద్ధ విమానాలు వెళ్లినట్లు సానియా పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉన్న మన భారతీయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భయాందోళనలకు గురవుతున్నారు. అక్కడ ఉన్న మన భారతీయులు చాలా మంది స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చేశారు టెన్నిస్ మాజీ స్టార్ సానియా మీర్జా ( Sania Mirza ). ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులు వివరించారు.
సానియా మీర్జా ఇంటిపై నుంచే విమానాలు
మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే తన కుమారుడు ఇజ్ హాన్ తో కలిసి దుబాయ్ నుంచి భారత్ కు చేరుకున్నారు సానియా మీర్జా. ఈ సందర్భంగా దుబాయిలో ఆమె ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి తాజాగా మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు.
తాము ఉన్న ఇంటి పై నుంచి యుద్ధ విమానాలు వెళ్లాయని పేర్కొన్నారు సానియా మీర్జా. ఆ యుద్ధ విమానాలు ఒకదానికొకటి అడ్డుకోవడం చూసామని తెలిపారు. తమ ఇంటికి 400 నుంచి 500 మీటర్ల దూరంలోనే విమానాల శకలాలు పడ్డాయి అని గుర్తు చేశారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉండి వణికిపోయినట్లు వివరించారు. కాగా రంజాన్ పండుగ పూర్తయిన తర్వాత తిరిగి, దుబాయ్ కు ఇజ్ హాన్ తో కలిసి సానియా మీర్జా వెళ్లే ఛాన్స్ ఉంది.






